జమ్మికుంట :నేటిధాత్రి
విద్యుత్ షాక్తో రెండు పాడి గేదెలు మృతిచెందాయి. ఈ ఘటన మండల పరిధిలోని తనుగుల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన మూల ప్రభాకర్ కు చెందిన ఒక గేదె, పైడిపల్లి సంపత్ కు చెందిన ఒక గేదె మేత కోసం పొలం వైపునకు వెళ్లాయి.
గేదెలు మేత మేస్తున్న సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో షాక్ గురై అక్కడిక్కడే మృతిచెందాయి.
గేదెల యజమానులు మంగళవారం వాటికోసం వెతుకుతుండగా గ్రామ శివారులో తెగిపడిన విద్యుత్ తీగల కింద మృతి చెందిన గేదెలను గుర్తించారు.
ఈ గేదెల విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. పాడి గేదెలు మృతిచెందటంతో తమ కుటుంబ జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు కోరారు.