నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బచ్చు వెంకటేశ్వరరావు తల్లి సుకపాలమ్మ అనారోగ్యంతో గురువారం రాత్రి మరణించగా విషయం తెలుసుకున్న నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ గోగుల రాణా ప్రతాపరెడ్డి మృతురాలి స్వగృహానికి చేరుకొని ఆమె పార్దివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి తడుక వినయ్ గౌడ్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు మాలోత్ అనిల్, నాయకులు ఓదెల అశోక్, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు