గిరిజన చట్టాల్ని పటిష్టంగా అమలు చెయ్యాలి

అక్రమ బహుళ అంతస్తులు కూల్చివేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఏ.ఎస్పీ గుండాల మండల అధ్యక్షులు పూనేం రమణబాబు ఆధ్వర్యంలో గుండాల గ్రామపంచాయతీ కార్యాలయం నుండి మండల తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి తహసిల్దార్ కు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ,1/70 చట్టానికి విరుద్ధంగా వలస గిరిజ నేతరులు విచ్చలవిడిగా బహుళ అంతస్తులు, అక్రమ వ్యాపారాలు భూములు కొనడం జరుగుతుంది పూర్తిగా ఏజెన్సీ చట్టాలను అణచి వేస్తుంటే ప్రభుత్వం ఏమి ఎరగనట్టు వ్యవహారిస్తుందన్నారు. గిరిజననేతర వలసలను అరికట్టకపోతే జరగబోయే రన రంగానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి అని హెచ్చరించారు, మా చట్టాలను బహిరంగంగా అంతం చేస్తుంటే ఆదివాసి ప్రజాపాలకులు కనీసం మాట వరకు కూడా మాట్లాడే పరిస్థితి లేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఆదివాసి విద్యార్థులు,మేధావులు పోరాటానికి సిద్ధం కావాలని మన చట్టాలను కాపాడుకునే దిశగా సిద్ధం కావాలని,లేనిపక్షంలో మన గ్రామంలో మన ఉనికి ప్రమాదంలో పడతది అని గ్రహించాలని, మండలం తాసిల్దార్ అక్రమ చొరబాటు దారులు ఆక్రమించిన ప్రభుత్వ భూములను వారు నిర్మించుకున్న గృహాలను ప్రభుత్వం స్వాధీనపరిచి సుమోటోగా ఎల్టిఆర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో తీవ్ర ఉద్యమ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తది అని హెచ్చరించారు.తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోడెం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆదివాసీలకు1/70 చట్టం జీవనాడి ఈ చట్టం అంతమైతే ఆదివాసులు అందరూ కనుమరుగు అవడం తప్పదు అందుకని ఓ ఆదివాసి యువత మేధావులారా మన పోరాటం భావితరాలకు బాటలు వేసే విధంగా సాగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నామన్నారు.గుండాల తాసిల్దార్ ఎల్టిఆర్ కేసులు నమోదు చెయ్యకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చెవి చూడాల్సి వస్తది అని హెచ్చరించారు.తాసిల్దార్ కి అన్ని రకాల ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.జాప్యం చేస్తే ఊరుకునేదే లేదు ఎంతవరకైనా పోరాడుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోగ్గేలరాజేష్, పూనేం వసంత్, పెండకట్లనాగరాజ్, వాగబోయిన నరసింహారావు,రవీందర్,జబ్బాసుదర్శన్,కల్తీ మల్లయ్య, కొడెంభరత్,గోగ్గేల సుధాకర్,చింత శ్రీను, పెండకట్ల మహేందర్, వేణు,సనప నర్సయ్యతదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version