చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలం నైన్ పాక ఉన్నత పాఠశాలలో చాలా సంవత్సరాలు పనిచేసి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళారు. వీరు విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఎండాకాలం లో చల్లని నీరు అందించాలని ముప్పై ఎనమిది వేల రూపాయల విలువ గల వాటర్ కూలర్ ని పాఠశాల కు అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు . గణితంలో ప్రజ్ఞవంతులైన ఆలేటి సాంబయ్య*, క్యాతం శ్రీధర్*, సాంఘీక శాస్త్ర, ఉపాధ్యాయురాలు మోత్కూరి లావణ్య*, తెలుగు లో ప్రావీణ్యం ఉన్న శ్రీధర్, హిందీ భాష లో జీవించే సిరిపురం సతీష్ క్రీడలు ఆరోగ్యమే జీవన గమనం అని చాటిన వ్యాయామ ఉపాధ్యాయుడు నూకల లింగయ్య*ఇటీవల వృత్తి రీత్యా వేరే పాఠశాలకు బదిలీ మరియు పదోన్నతి పై వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది. చాలా సంవత్సరాలు పనిచేసిన వీరు నైన్ పాక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊర్మిళ* ఆహ్వానం మేరకు ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చిన ఉపాధ్యాయులను స్వాగతం , సన్మానం, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠశాలకున్న తమ అనుభవాన్ని ఉపాధ్యాయులు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, ప్రణీత ,స్వాతి, విజయశాంతి, పల్లవి, ప్రవీణ్ కుమార్, సుజాత,రమేష్, రాజయ్య,రఘు,శుభాషిణి, ఓదెలు, సి ఆర్ పి తిరుపతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు