గొల్లపల్లి, నేటి ధాత్రి:
కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా గ్రామాల్లో స్వచ్ఛమైన నీటిని అందించేందుకు తాగునీటి సరఫరాలో ఏర్పడేటటువంటి సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడానికి మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ ఆధ్వర్యంలో ఒక్కో గ్రామపంచాయతీ నుండి ఒకరిని లేదా ఇద్దరిని గ్రామం మంచినీటి సహాయకుడిగా ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఎంపిక చేసిన వారందరికీ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో వారికి శిక్షణ తరగతులు శుక్రవారం నుండి మంగళవారం వరకు నిర్వహిస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ డి ఇఇ రోహిత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వాటర్ క్వాలిటీ, హ్యాండ్ పంప్ మెకానిక్ నాలుగు అంశాల మీద నాలుగు రోజులపాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా, మిషన్ భగీరథ ఇంట్రా డిఇఇ మురళి, గ్రిడ్ డిఇఇ రోహిత్, ఎంపీడీవో రామ్ రెడ్డి, ఎంపీ ఓ సురేష్ రెడ్డి, ఏఇఇ లక్ష్మీ ప్రసన్న గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.