ఉరివేసుకొని ఆత్మహత్య
వీణవంక,( కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన ముష్క సదయ్య తండ్రి కొమురయ్య 45 వయస్సు కొన్ని రోజుల నుండి ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులకు గురైనాడు అతని కుమార్తె వివాహానికి కట్న కానుకలు వెలుతాయో ఎల్లయో అనుకోని ఏం చేయాలని అర్థం కాక మనస్తాపం చెంది వ్యవసాయ పొలం వద్ద కు వెళ్లి అతని పొలం సమీపంలో ఉన్న మోత్కుచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు తెలుసుకొని ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపినారు.