# పార్టీ విధేయతకు గుర్తింపు తప్పదు.
నర్సంపేట , నేటిధాత్రి :
కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్ రావు ను ఇటీవల వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా పిసిసి ద్వారా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు.ఈ సందర్భంగా నర్సంపేట పట్టణ అధ్యక్షులు రాజేందర్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ తక్కలపల్లి రవీందర్ రావు గత 25 సంవత్సరాలు క్రితం దొంతి మాధవ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు పర్యాయాలు పిఎసిఎస్ చైర్మన్ గా, ఖానాపురం ఎంపీపీగా కొనసాగారు.ఎమ్మెల్యే మాధవ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గం కన్వీనర్ గా కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో ఆయన పనితీరుకు పార్టీ విధేయతకు నర్సంపేట ఎమ్మెల్యే సూచనల మేరకు పిసిసి ద్వారా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించబడ్డారన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులను రవీందర్ రావు అధిరోహించి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి మాదాసి రవి, పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, దూడల సాంబయ్య మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మసూద్, నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ ఎండి బాబా ,మాజి వార్డ్ మెంబర్ గాజుల రమేష్, పట్టణ కార్యదర్శులు నాడెం నాగేశ్వర్, నాంపల్లి వెంకట్ గౌడ్ పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షుడు ముత్తినేని వెంకన్న, లక్కాసు రమేష్, దండెం రతన్ కుమార్, బిట్ల మనోహర్, కొప్పు అశోక్, గోపు మహేందర్ రెడ్డి, ఎరుకల రమేష్, ఎండి అయూబ్ ఖాన్, కుమార్, దేశి సాయి పటేల్, కుసుమ సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.