ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి సంపూర్ణ సహకారం

భారత్ వికాస్ పరిషత్ ప్రతి నిధుల వెల్లడి..

లక్ష్మీ పల్లి విద్యార్థులకు స్టీల్ ప్లేట్ల వితరణ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి, పేద విద్యార్థుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందించనున్నట్లు భారత్ వికాస్ పరిషత్ (బి వి పి) ప్రతినిధులు వెల్లడించారు. పంచాయితీ రాజ్ శాఖ కు చెందిన విశ్రాంత చీఫ్ ఇంజనీర్ జి.విజయ్ కుమార్ సహకారంతో భారత్ వికాస్ పరిషత్ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన వంద మంది విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. పాఠశాల ఇంచార్జి హెచ్ ఎం అశ్విని చంద్రశేఖర్, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర సలహా దారులు జి.పాండు రంగం, పాలమూరు శాఖ అధ్యక్షులు భూషణ్ పాండే, కార్యదర్శి పుట్టి రమేష్ చందర్ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. భారతీయ సాంస్కృతిక , సాంప్రదాయాల పరి రక్షణతో పాటు సమాజ సేవ యే లక్ష్యంగా భారత్ వికాస్ పనిచేస్తుందని అన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు చేయూత నిస్తూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు తమావత్తు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, బి వి పి లాంటి సంస్థలు ,దాతలు అందిస్తున్న చేయూతను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

పాఠశాలకు మాజీ సర్పంచ్ విరాళం..

లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ప్రగతికి ఆ గ్రామ మాజీ సర్పంచ్ రాందేవ్ రెడ్డి రూ: 5000/ వేల రూ పాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు పాఠశాల ఇంచార్జి హెచ్ ఎం అశ్విని చంద్రశేఖర్ కు చెక్కును అందజేశారు. పాఠశాల ఇంచార్జి హెచ్ ఎం అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ, భారత్ వికాస్ పరిషత్ సేవలు అమోఘమని కొనియాడారు. లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల కు గతంలో గ్రంథాలయ పుస్తకాలు, ప్రస్తుతం విద్యార్థులందరికీ స్టీల్ ప్లేట్లు వితరణ గా అంద జేయడం అభినంద నీయమని అన్నారు.
పాఠశాల అభి వృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తున్న బి వి పి ప్రతి నిధులతో పాటు మాజీ సర్పంచులు రాందేవ్ రెడ్డి,కృష్ణా రెడ్డి, విశ్వేశ్వరచారి లను పాఠశాల ఉపాద్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు యతిరాజ చారి, రాంచందర్, చంద్రుడు,వెంకటేశ్వర గుప్త, శంకరయ్య, ఉన్నత పాఠశాల హెచ్ ఎం కె కె శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వాకిటి అరుణ , ఉపాధ్యాయులు విజయ లక్ష్మీ,వెంక ట్రాములు,గ్రామస్తులు,తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *