నేడు ఆసియా సోక్రటీస్ ఆధునిక విప్లవవాది ద్రావిడ ఉద్యమ పితామహులు EV పెరియార్ 146 వ జయంతి

భద్రాచలం నేటి దాత్రి

స్థానిక భద్రాచలం మదర్ తెరిసా కళాశాల నందు స్వయ గౌరవ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఆసియా సోక్రటీస్, సామాజిక, సాంఘిక ఉద్యమకారులు, ఆధునిక విప్లవాది,హేతువాది , స్ర్తీ వాది ,సామాజిక న్యాయం, సమానత్వం, స్వయ గౌరవ పోరాటవాది ద్రావిడ ఉద్యమ పితామహులు పెరియర్ రామస్వామి 146 జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాలరాజా పెరియార్ వహించటంజరిగింది.ముఖ్యఅతిథిగా ప్రముఖ హేతువాది సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ భాను ప్రసాద్, సాంఘిక సామాజిక ఉద్యమకారులు ఈటె రాజేశ్వరరావు, విశిష్ట అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, పి డి యస్ యూ డివిజన్ సెక్రెటరీ శివకుమార్, పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ….పెరియార్ 1879 సంవత్సరం 17 వ తేదీన బలిజ నాయుడైన వెంకటప్ప నాయకర్, చిన్ని తాయమ్మళ్ దంపతులకు కోయంబత్తూరు లో జన్మించారని,పెరియార్ కుటుంబీకులు మన తెలుగు ప్రాంతానికి చెందినవారని,పెరియార్ కుటుంబీకులు ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లా నుండి మైసూర్ సంస్థానానికి వలసవెళ్ళారని,అక్కడి నుండి తమిళనాడు లోని ఈరోడ్ లో స్థిరపడ్డారని,అన్నారు.పెరియార్ శూద్ర కులానికి చెందిన వారని,మన దక్షిణ భారతదేశంలో నాయుడులు తమిళనాడు లో నాయకర్లు.ఈ నాయకర్లు ,నాయుళ్ళు హిందూ సమాజంలో శూద్రులు, ఒబిసీలు.హిందూ సమాజంలో ఈ సామాజిక వర్గాలకు సమాజంలో గౌరవం లేదని,అగ్రవర్ణాల వారికి సేవ చేయడమే ఈ శూద్రులు చేసే పని అని అన్నారు.
పెరియార్ తన భావాలను సూటిగా చెప్పేవారని,పెరియార్ తన స్వంత ఆస్తినీ,వ్యక్తిగత సౌఖ్యాలనూ సమాజం కోసం త్యాగం చేసారని, ప్రజలు పెరియార్ ని (తమిళంలో పెరియార్ అనగా తండ్రి అని అర్థం) అని పిలుచుకునేవారని,.హిందూ సమాజంలో ఆత్మగౌరవం లేదని, దేవుడు, పూజలు,మూఢనమ్మకాలు తప్పితే ఎక్కడా సమానత్వం లేదని, కులతత్వం,బ్రాహ్మణ పూజారి వ్యవస్థ దోపిడీ ఇవే ఉన్నాయని, మానవత్వం లేదని,.సాటి మనిషి బాధను పట్టించుకోకుండా అతని కులం గురించి ఆలోచించే మనుషులు ఉన్న హిందూ సమాజంలో దేవుడు లేడని ,బ్రాహ్మణ భావజాలంపై పెరియార్ పోరాటం చేశారని గుర్తు చేశారు.తన ప్రజలకు సామాజిక న్యాయం నిరాకరించే సమాజం ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడే శక్తి గల నాయకులను సృష్టించ లేదని,రాజకీయ ఆత్మ గౌరవం,సాంఘిక ఆత్మ గౌరవం చెట్టపట్టాలు పట్టుకొని సాగుతాయని ఆ రెండూ ఒకటి లేకుండా మరొకటి అభివృద్ధి చెందవని.మనం సాంఘిక ఆత్మ గౌరవం సాధించినట్లయితే రాజకీయ ఆత్మ గౌరవం దానితో పాటే వస్తుందని. పెరియార్ అన్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటుపడాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, పెరియర్ ఆలోచన విధానాలతో విద్యార్థులు పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయుడు, కే నిహాల్, ఇసంపల్లి ముత్యం మదర్ తెరిసా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version