భూపాలపల్లి నేటిధాత్రి
ఈ రాష్ట్రం లో
లోని పేద మధ్యతరగతి వర్గాలైన బీసి ఎస్సి ఎస్టీ ఈబిసి ప్రజల ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద మధ్యతరగతి వర్గాలైన
బీసి ఎస్సి ఎస్టీ ఈబిసి ప్రజల ఉన్నారు అంటే దాదాపు ఒక కోటి కుటుంబాలు ఉన్నాయి నేడు వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా విద్యా, వైద్యం, ఉపాధి,భూమి, ఇల్లు,ఈ ‘5’ సమస్యలను పరిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలంతా సుఖ: సంతోషాలతో, శాంతి, సామరస్యాలతో జీవిస్తారు
ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రాణాలను కాపాడాలి ప్రతి గ్రామములలో “
ఆధునిక హాస్పిటల్” నిర్మించాలి
ప్రజలందరికీ చేసుకోవడానికి వారి వారి అర్హతలను బట్టి ఉపాధిని అందించి చేతినిండా గౌరవప్రదమైన పనిని కల్పించాలి,
తద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యముతో ఒక ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలి అర్హులైన వారందరికీ 200 గజాల స్థలంలో నాలుగు గదులు ఇల్లుని నిర్మించి ఇవ్వాలి ఈ ‘5’ పథకాలకు” పూలే,అంబేద్కర్ సాహు మహారాజ్, కాన్సిరాం” ల పేర్లు పెట్టి ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసి రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలుగా బ్రతుకుతున్న
బీసి ఎస్సి ఎస్టీ ఈబిసి ప్రజల
ప్రజల జీవితాలలో సామాజిక సాంస్కృతిక ఆర్థిక మార్పుని తీసుకురావాలని 5 డిమాండ్స్ చేస్తున్నాం
5 డిమాండ్లను పరిష్కరించడం ద్వారా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా 90% పేద మధ్యతరగతి వర్గాలైన
బీసి ఎస్సి ఎస్టీ ఈబిసి ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి
ఈ పై డిమాండ్లను నెరవేర్చకుంటే
ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా రిలే నిరాహార దీక్షలో అమర నిరాహార దీక్షలో నిరసనలు ధర్నాలు చేస్తామము అని అ
న్నారు
ఈ కార్యక్రమంలో కండె రవి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కోశాధికారి
చిలపాక నాగరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు కుర్రి స్వామినాదన్ గుండ్ల ఓంకార్ రత్న రమేష్ బండారి దశరథం బోయిని ప్రసాద్ చెరుపెల్లి నవీన్ లాపాక రవి రవీందర్ లు పాల్గొన్నారు