జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో గురువారం గాంధీనగర్ లో నిర్మించిన వాటర్ గ్రిడ్ పంపు హౌస్ ను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ లోని నీటి సామర్థ్యత, పంపింగ్, నీటి శుద్దీ కరణ ప్రక్రియ, నీటి ప్రమాణాలను పరీక్ష చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు ప్రమాణాలను మైలారం గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీటిని గ్రిడ్ లో పనిచేసే ల్యాబ్ టెక్నిషియన్ లతో నీటి నాణ్యతను పరీక్ష చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి సరఫరా మరియు త్రాగునీరు వినియోగం పై కలెక్టర్ స్వయంగా వెళ్లి కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇందుకు కావలసిన మౌలిక ఆర్ధిక పరమైన అంశాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్ డబ్ల్యుఎస్ ఈ ఈ మణిక్యరావు, ఈ ఈ నిర్మల, గ్రిడ్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లిచే జారిచేయనైనది