తీన్మార్ మల్లన్నకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ – హనుమకొండ జిల్లా జేఏసీ చైర్మన్ కస్తూరి రవి
హసన్పర్తి (నేటిదాత్రి) :
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ప్రవేటు ఉద్యోగుల జేఏసీ తరఫున పట్టభద్రులందరూ ఈనెల 27వ తేదీన జరిగే (ఎమ్మెల్సీ) ఎన్నికల లో భాగంగా పట్టభద్రులందరూ రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతూ గత ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదని వారు పడ్డ కష్టం మరెవరికి రావద్దని గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూపు 1 2 3 రాసిన ప్రతి ఒక్క నిరుద్యోగి చావు అంచుల దాక వెళ్లి బ్రతికారని వారు గుర్తుచేశారు. గత ప్రభుత్వం వారి అధికారాన్ని కాపాడుకోవడానికి మాత్రమే గ్రూపు ఎగ్జామ్ పెట్టారని ఎగ్జామ్ రాసిన ప్రవళిక చనిపోతే కనీసం మానవత్వంతో చాటి మనిషిగా గుర్తించలేక లవ్ ఎఫైర్ తో చనిపోయిందని పబ్బం గడిపారే తప్ప వారి యొక్క కుటుంబానికి భరోసా ఇవ్వకుండా చనిపోయిన కొంతమంది నిరుద్యోగులకు కనీసం ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటించని ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తుందో బిఆర్ఎస్ పార్టీ ఆత్మ విమర్శన చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా సెంటర్లో ఉన్న బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతూ నిరుద్యోగులకు అండగా ఉంటాము అని చెప్పి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని కనీసం ఒక కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుపేద నిరుద్యోగ యువకులకు అన్యాయం చేస్తూ కులమతాలను రెచ్చగొడుతూ యువతను తప్పుదోవ పట్టిస్తుందే తప్ప కనీసం నిరుద్యోగ యువతకు ఏమి చేస్తే యువత బాగుపడుతుంది అనే ఆలోచనలు లేకుండా అంబానీ అనిల్ లాంటి బడ పెత్తందారులకు కొమ్ముకాస్తూ ఇటు బిఆర్ఎస్ అటు బిజెపి పార్టీలను నమ్మే పరిస్థితిలో పట్టా బద్రులు లేరని వారు అన్నారు. ప్రజాపాలనపై నమ్మకంతో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే తీన్మార్ మల్లన్న ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ఆశాభావంతో పట్టభద్రులందరూ ఉన్నారని వారు తెలిపారు.
