రైతు డబ్బులను వదిలేసి వైన్ షాప్ డబ్బులను ఎత్తుకెళ్లిన వైనం
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండల తాసిల్దార్ కార్యాలయానికి సమీపం లో ఉన్న మల్లికార్జున వైన్ షాపులో మంగళవారం రాత్రి దాదాపు రెండు గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు వైన్ షాప్ కు వెనకాల ఉన్న దర్వాజా ద్వారా ప్రవేశించి అందులో కౌంటర్లో ఉన్న లక్ష డెబ్బై వేలు అపహరించారు అదేవిధంగా అదే రోజు ఒక రైతు తనకు ధాన్యం అమ్మిన డబ్బులు తన అకౌంట్ నుండి వైన్ షాప్ ఓనర్ అకౌంట్లకు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు షాపు మంగళవారం దాదాపు రెండు లక్షల 70 వేలు నడవడంతో రైతుకు ఇచ్చే లక్ష రూపాయలు తీసి ఒక కవర్లో పెట్టి ఉదయాన్నే రైతుకు ఇచ్చేందుకు పక్కకు పెట్టడంతో ఆ లక్ష రూపాయలు ముట్టకపోవడం విశేషం.. ఈ విషయం బుధవారం ఉదయాన్నే షాపు 10 గంటలకు ఓపెన్ చేసి చూడడంతో కౌంటర్లో వస్తువులు అన్ని చిందరవందరిగా ఉండడం చూసి చోరీ జరిగిందని అనుమానం వచ్చి చూడగా డబ్బులు లేకపోవడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్సై అశోక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు వైన్ షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ దాదాపు మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో షాపు కు వెనకాల ఉన్న దర్వాజను గట్టిగా తోయడంతో దానికున్న బేడం ఓడిపోవడంతో అందులో నుండి ప్రవేశించాడని ఆ తలుపుకు అడ్డంగా చిన్న ఆల్ ఆల్ మర ఉంది దాన్ని పక్కకు తోసేసి లోపలికి ప్రవేశించి కౌంటర్ దగ్గరికి వచ్చి డబ్బులు దొంగిలించడం జరిగిందని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు.