బాల్క సుమన్ గెలుపు కోసం మీ వెంటే మేము ఉన్నాం సర్పంచ్ రాజ్ కుమార్
జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండలం నర్వ గ్రామపంచాయతీ నుండి సర్పంచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మందమర్రి లో జరుగుతున్న సీఎం కేసీఆర్ భారీ సభకు పెద్ద ఎత్తున బయలుదేరిన గ్రామస్తులు మరియు యువకులు మాకు మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలి. మా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలవాలి.
ఎన్నో ఏళ్ల నుంచి జరగని పనులు, రోడ్లు, బ్రిడ్జిలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు బాల్క సుమన్ మా నియోజకవర్గానికి వచ్చాక మేము చెప్పలేని అన్ని అభివృద్ధి పనులు చేసి చూపించడం జరిగింది. బాల్క సుమన్ గెలుపు కోసం బిఆర్ఎస్ పార్టీ కోసం మా స్వయ శక్తుల పనిచేస్తామని సర్పంచ్ రాజ్ కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రాజ్ కుమార్, గోదారి బాలకృష్ణ, దూట నారాయణ, కోట వెంకటేష్, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.