ఇంటింటా విస్తృత ప్రచారం
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలో బిఆర్ఎస్ వర్గ పోరు షురూ అయింది. ఒకవైపు గండ్ర దంపతుల వర్గం మరోవైపు మాజీ స్పీకర్ మధుసూదన చారి వర్గం. ఎవరి వర్గం వారు లోకసభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గండ్ర దంపతుల వర్గం కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ వర్గం దాదాపుగా ఖాళీ కాబోతున్నది. చారి వర్గం మళ్లీ పుంజు కుంటున్నది. చారి వర్గం బలం నిరూపించుకునేందుకు శాయంపేట, మైలారం, జోగంపల్లి, సాధన పల్లి, రాజు పల్లి, కాట్రపల్లి, నేరేడుపల్లి వివిధ గ్రామాలలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ పార్లమెంటరీ అభ్యర్థి సుధీర్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చారి వర్గం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం రవీందర్, బగ్గి రమేష్, నిమ్మల మహేందర్, గణేష్, రాజ మహమ్మద్, అడప ప్రభాకర్ కొమ్ముల శివ, సారయ్య బే రుగు రాకేష్, వెంకట్రాం, మాధవరావు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.