#నెక్కొండ, నేటి ధాత్రి:
వాతావరణ సమతుల్యతను కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే జీవకోటి మనుగడ సాధ్యమని ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ అన్నారు. నెక్కొండ మండలం అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాలకు అనుగుణంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవడం ముఖ్యమన్నారు. నర్సరీలలో అందిస్తున్న పువ్వులు ,పండ్ల మొక్కలను ,నీడనిచ్చే మొక్కలను విరివిగా నాటి కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ గీత, యాకయ్య, భూలక్ష్మి, శ్యాంసుందర్, గోపాల్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.