భద్రాచలం నేటిదాత్రి
మలిదశ పోరాటానికి వరద బాధితులు సిద్ధం కావాలి
వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ఈనెల 20వ తారీకు ఎమ్మార్వో కార్యాలయం ముందు జరిగే ధర్నాని జయప్రదం చేయండి
రెవెన్యూ వారు గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి వరద బాధితులు కుటుంబాలను గుర్తించాలి
గతంలో రెవెన్యూ వారు వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
మండలంలో రెవెన్యూ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రెవిన్యూ వారు సర్వే చేసి బహిర్గత పరచాలి
వరద బాధితులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాడు పోరాటంలో భాగస్వామ్యం అయిన కాంగ్రెస్ పార్టీ కుడా తీసుకోవాలి
వరద బాధితుల పోరాటానికి రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు మేధావులు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు అండగా నిలవాలి
సి పి ఐ ఎం ఎల్ మాస్ లైన్ (ప్రజాపంథ) పార్టీ & వరద బాధితుల పోరాట సంఘం
.
చర్ల మండల కేంద్రంలో ఉన్న డివికె భవన్లో వరద బాధితుల పోరాట సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వరద బాధిత పోరాట సంఘం గౌరవ అధ్యక్షులు సిపిఐఎంఎల్ (మాస్ లైన్) ప్రజాపంథా పార్టీ డివిజన్ నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం నాటి ప్రభుత్వ0 ఉన్నప్పుడు వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని అనేక సందర్భాల్లో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా అధికారులు గ్రామస్థాయిలో వరద బాధితులను గుర్తిస్తామని సర్వే చేస్తామని చెప్పారు అంతేకాకుండా ప్రభుత్వ భూమిని గుర్తించి వరదా బాధితులు అందరికీ మేరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు గత brs ప్రభుత్వం వరద బాధితుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించలేదు గత ప్రభుత్వం వరద బాధితుల సమస్య పరిష్కరించడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైందని అన్నారు అందువల్లనే అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు అందువలన క్యాలెండర్లో సంవత్సరం తేదీ మారింది అధికారులు మారారు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మారాయి కానీ ఇప్పటివరకు రెవిన్యూ వారు ఇచ్చిన హామీ గ్రామస్థాయిలో సర్వే జరగలేదు ప్రభుత్వ భూమిని గుర్తించలేదు వరద బాధితులకు భూమి కూడా ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు ఈ నిర్లక్ష్యాన్ని వరద బాధితుల పోరాట సంఘం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆనాడు వరద బాధితులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి వివిధ పార్టీలు ప్రజాసంఘాలు మేధావులు మద్దతు తెలిపారని అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటంలో భాగస్వామ్యం అయ్యిందని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది కాబట్టి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని తెలిపారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో వరద బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము నమ్ముతున్నాము ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి వరద బాధితులను బాధిత కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వ భూమిని సర్వే చేసి బహిర్గత పరచాలని తద్వారా వరద బాధితులకు మేరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం దక్కేంతవరకు వరద బాధిత పోరాట సంఘం సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని తెలియజేశారు ఈ డిమాండ్ల పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వానికి సమస్య తీవ్రతను తెలిపేందుకు ఈనెల 20వ తారీకు శుక్రవారం రోజున ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా మరియు దరఖాస్తు దరఖాస్తు చేయు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వరద బాధితులు తమ సమస్య పరిష్కారం కోసం మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఏదైతే గతంలో ఈ పోరాటానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నాయకులు యువకులు, విద్యార్థులు మేధావులు ప్రముఖులు తదితర ప్రజలందరూ కూడా ఈ వరద బాధితులకు అండగా నిలబడాలని మద్దతు ఇవ్వాలని కోరారు…
ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండ కౌశిక్ చేన్న0 మోహన్ పూజారి సామ్రాజ్యం ప్రశాంత్ గౌర్ల నాగమణి పురిటి సుశీల, కుమారి, దేవి, మంగ, రాణి ,సరోజినీ ,సూరమ్మ రవి,పున్నారావు గూడపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.