విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకొని నిరసన

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కళ్ళకు గంతలు కట్టుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ నెల రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటికీ కాలేదు యాజమాన్యాలు ఇప్పటికే బందు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది దీని వల్ల పేద డిగ్రీ విద్యార్థుల చదువుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, అటు చదువులు కొనసాగించలేక ప్రభుత్వం యాజమాన్యాల మధ్య విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం పడుతుందని, గత ప్రభుత్వం చేసిన తప్పులను రేవంత్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు పాలన అధికారులకు ఏవిధంగా అయితే వేతనా బత్యాలు చెల్లిస్తున్నారు మరి అదేవిధంగా విద్యార్థులకు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలను తక్షణమే విడుదల చేయుటకు చర్యలు తీసుకోవాలని మచ్చ రమేష్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, మచ్చ అభిలాష్, శ్రీనివాస్, నరేష్, సురేష్, రవి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version