జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్
మంచిర్యాల నేటిదాత్రి
మంచిర్యాల జిల్లాకేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను కమిటి అధ్యక్షులు సపోట్ శంకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్ హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. తన బోధనల ద్వారా బంజారాలను సన్మార్గంలో నడిపించేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు.విద్య ద్వారానే అన్ని రంగాలలో ముందుకు సాగటం సాధ్యమవుతుంది, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలందరిని ఉన్నత విద్య వైపు ప్రయాణించేలా కృషి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ బంజారాల గొప్పతనాన్ని వారి గత చరిత్ర ను తెలియజేశారు.అనంతరం అతిథిగా విచ్చేసిన మాజీ గిరిజన మంత్రి అమర్ సింగ్ తిలావత్ మాట్లాడుతూ బంజారాలు అందరు ఐక్యంగా ఉండి మన హక్కులను సాదించుకోవాలన్నారు.
.జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ ప్రజా శ్రేయస్సు కోసం అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. అయన అడుగు జాడల్లో అందరు నడవలన్నారు. అనంతరం .సంత్ సేవాలాల్ మహారాజ్ జిల్లా ఉత్సవాలా కమిటి అధ్యక్షులు సపోట్ శంకర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమ విజయవంతానికి నాతో పాటు తమ హోదాలను మరిచి రాత్రి పగలు కృషి చేసిన నా బంజారా కుటుంబ సభ్యులందరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధవత్ ప్రకాష్ నాయక్, దుప్ప నాయక్ రఘునాథ్ చౌహన్, ఇందల్ నాయక్, రాజు నాయక్, మల్లేష్, డా,, పటేల్, డా,, గణేష్ రాజు,పరుశురాం, ప్రేమసింగ్, ప్రకాష్,సక్ లాల్, నిలయ్య తదితరులు పాల్గొన్నారు

