గులాబీ దండు కదిలింది…గుండెల నిండా అభిమానంతో

*పండగ వాతావరణంలో కొనసాగిన చల్మెడ నామినేషన్ ఘట్టం

*వేలాదిగా తరలివచ్చిన గులాబీ సైన్యం

*గులాబీమయమైన వేములవాడ పట్టణం

వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుండెల నిండా అభిమానంతో వేములవాడ నియోజకవర్గ గులాబీ దండు కదిలింది. వేలాది మంది గులాబీ సైనికుల రాకతో వేములవాడ పట్టణం గులాబీ రంగును పులముకుంది. వివరాల్లోకి వెళితే బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు గురువారం నామినేషన్ వేశారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద నుండి రాజన్న
ఆలయం మీదుగా తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేములవాడ పట్టణంతో పాటు వేములవాడ అర్బన్, రూరల్, కథలపూర్, మేడిపల్లి, భీమారం, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట మండలాల నుండి సుమారు 20వేల మంది గులాబీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధాన రహదారిలోని అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్ద వేలాదిగా తరలివచ్చిన గులాబీ సైన్యం సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి చల్మెడ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ గులాబీ సైన్యాన్ని చూస్తే మాటలు రావడం లేదని, ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన అన్నదమ్ములకు, యువకులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాబోయే 20 రోజుల్లో గులాబీ సైనికులందరూ కష్టపడి పని చేయాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ పార్టీ కుటుంబ సభ్యులను చూస్తుంటే గెలుపు పక్క అనిపిస్తుందని, సైనికులందరూ కష్టపడి, ఎవరికి బయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా దైర్యంగా పని చేయాలని, కష్టపడి పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తను కడుపులో పెట్టి కాపాడుడుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ సైన్యాన్ని చూస్తే గెలుపు పక్క అనిపిస్తుందని, ప్రతి ఒక్క నాయకుడు,కార్యకర్త వచ్చే 20రోజులు ఎవరి గ్రామాల్లో వారే ఉంటూ ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందనే విషయాలను ప్రజలకు, వివరించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టాన్ని, తెలంగాణపై చేసిన ద్రోహన్నీ ప్రజలకు అర్థం చేయించి, కాంగ్రెస్ నాయకులను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి-రాజు, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి,జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏషా వాణి-తిరుపతి, నాగం భూమయ్య, గట్ల మీనయ్య, ఎంపీపీలు బూర వజ్రమ్మ-బాబు, బండ మల్లేశం యాదవ్, చంద్రయ్య గౌడ్, లావణ్య-రమేష్, రేవతి-గణేష్, స్వరూప-మహేష్, ఉమా-రత్నాకర్ రావులతో పాటు ఆయా మండలాల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు 20వేల మంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version