ప్రమాద అంచున ప్రయాణం
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక నేరేడుపల్లి రోడ్డు మార్గము వానకాలం కురిసిన వర్షాలకు దారి తెగిపోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది. గ్రామం నుండి రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే ఈ దారి గుండా వెళ్లాలి గత కొన్ని నెలల క్రితం భారీ వర్షాలకు బ్రిడ్జి నిర్మించినప్పుడు అటు ఇటుగామట్టి పోయడం జరిగింది ఈమట్టి మొత్తం అధిక వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నది రైతన్నలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుకపోయిన మట్టి గుండా వాహనదారులు, ఎడ్ల బండ్లు ,ప్రజలు ప్రయాణం అరచేతిలో పెట్టుకొని నడుపుతున్నారు పంట పొలాల వెళ్లాలంటే అధిక బరువున్న బస్తాలను పంట చేనులోకి వెళ్లాలంటే రైతన్నల ప్రయాణం నరకంగా సాగి స్తున్నారు. గత ప్రభుత్వం రైతులకు సహాయం చేయకపోవడం దురదృష్టకరం. రైతన్నలు పంటలు వేసుకుని పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డును బాగు చేసి ప్రజా సమస్యలను తీర్చాలని ఎవరు కూడా ఆలోచిస్తా లేరని ప్రజలు వాపోతున్నారు ఇకనైనా మండల అధికారులు నాయకులు ప్రమాదం జరగకముందే బాగు చేయాలని పత్తిపాక రైతన్నలు,ప్రజలు స్థానిక ఎమ్మెల్యే సమస్యను గుర్తించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.