తహసిల్దార్ కార్యాలయం ముందు ఎంసిపిఐ (యు ) ప్రజా సంఘాల ఆందోళన
నర్సంపేట,నేటిధాత్రి :
గత ఎన్నికల ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంసిపిఐ యు, ప్రజా సంఘాల డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నర్సంపేట తాసిల్దార్ కార్యాలయం ముందు ఎంసిపిఐ యు, తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు .అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు.ఎంసిపిఐ (యు) నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి , ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మాశుక్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తైన తెలంగాణ సమాజం ఆశించిన విధంగా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.గత ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ కేసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నోచుకోకపోగా ఈ క్రమంలో వివిధ తరగతుల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రకృతి సైతం అధిక వర్షాలతో ఇబ్బందులు గురి చేస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో ఆదుకోవాలని కోరారు.ఇంటి స్థలం లేని పేదలకు బూమి కేటాయించి ఇంటి బంధు పథకం ప్రవేశపెట్టాలని తెలిపారు.55 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు పేద రైతులకు నెలకు రూ. 5 వేలు పెన్షన్ ఇవ్వాలని కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు నిర్ణయించి అమలు చేయాలన్నారు.కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి ముఖ్యమంత్రి తన మాటలు నిలబెట్టుకోవాలన్నారు.మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు అరికట్టడానికి జిల్లా కేంద్రాల్లో ట్రాక్కోర్టులు మహిళా స్టేషన్లు గ్రామ గ్రామాన షీ టీం ఏర్పాటు చేయాలన్నారు. బెల్ట్ షాపులో ఎత్తివేసి చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మాసుక్, ఏఐఎఫ్డిఎస్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు , విద్యార్థి సంఘం గర్ల్స్ కన్వీనర్ గణిపాక బిందు , రైతు సంఘం జిల్లా నాయకులు కేశెట్టి సదానందం , కలకోట్ల యాదగిరి , మహిళా సంఘం నాయకురాలు అరుణ , పద్మ , సాయి తదితరులు పాల్గొన్నారు.