రైతులకు రెండు లక్షల రుణమాఫీ వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తానన్న ఆమెని అమలు చేయాలని
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ….. మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్……
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని యుద్ధ ప్రాతపాదికన అమలు చేయాలని రైతాంగం అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు
నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుమందులను మార్కెట్ లోకి రాకుండా అరికట్టాలి నాణ్యమైన మేలైన విత్తనాలను 75 /సబ్సిడీ పై రైతులకు సకాలంలో ప్రభుత్వం నేరుగా అందజేయాలని
రైతు పండించిన అన్ని పంటకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించి నేరుగా కొనుగోలు చేయాలని రైతాంగ ఆత్మహత్యలను నివారించాలని రైతు బీమా పథకాలను రైతు డెవలప్మెంట్ కొరకు పాటుపడాలని డిమాండ్ చేశారు
ఈ దేశానికి రైతే వెన్నుముక అని పాలక ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్పినప్పటికీ రైతు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించడం గిట్టుబాటు రేటు ఇవ్వడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని రైతు లేనిదే రాజ్యం లేదు అనేది నగ్నసత్యం కానీ రైతును పట్టించుకునే ప్రభుత్వాలే ఈరోజు వరకు లేకపోవడం శోచనీయం
అనేక ప్రభుత్వాలు మారిన రైతుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేదని రైతు పరిస్థితి అగోమ్యగోచరంగా తయారయ్యాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను విస్మరించి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతు నడ్డి విరుస్తూ రైతులను పెట్టుబడుదారులైన ఆదాని అంబానీకి తాకట్టు పెట్టడం కోసం పెట్టుబడిదారుల పాద సేవకు ఊడిగం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన కొనసాగుతుందని కనుకనే నేడు రైతు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లుగా పాలక ప్రభుత్వాలు రైతుని మరణాల వైపు నెట్టుతున్నారని పాలకవర్గ లపై ధ్వజమెత్తాడు
ఎన్నికల అప్పుడు పాలక ప్రభుత్వాలు రైతులకి అనేక వాగ్దానాలను చేసి ఆచరణకి నోచుకోవడం లేదని పాలకవర్గ విధానాలపై మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇంజపెల్లి నరేష్ కొమురయ్య పైడయ్య పాల్గొన్నారు