చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్..
రామకృష్ణాపూర్,జనవరి 26, నేటిధాత్రి:
మార్నింగ్ వాక్ లో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి, సాయి కుటీర్, రామకృష్ణాపూర్ , బి జోన్ ప్రాంతాలలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆకస్మికంగా పర్యటించారు.కాలనీలలో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు.డ్రైనేజీలను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.క్యాతనపల్లి ఆర్ఓబి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి,భూ నిర్వాసితులకు రెండు మూడు రోజుల్లో పరిహారం క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్లు, మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టి ఫ్లై ఓవర్ ఆర్ ఓ బి వర్క్స్ స్పీడ్ చేయాలని కాంట్రాక్టర్ కి ఫోన్ ద్వారా తెలియచేశారు. సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లేకుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు, కాంట్రాక్టర్ల ను హెచ్చరించారు.ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.