చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే పీడి యాక్ట్ నమోదు.
మండల ప్రజలకుఎస్ఐ హెచ్చరిక.
మహా ముత్తారం నేటి ధాత్రి.
ఉదయం నిమ్మగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిమ్మగూడెం గ్రామానికి చెందిన కొందరు గుడుంబా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో గుడుంబా తయారుచేస్తారని సమాచారం మేరకు సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బందితో దాడులు చేయగా సుమారు 2700 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం చేసి 70 లీటర్ల గుడుంబాను సీజ్ చేసి పలువురు పైన కేసులు నమోదు చేయడమైనది ఎస్ఐ తెలియజేశారు.ఈ సందర్భంగా మహా ముత్తారం ఎస్సైమాట్లాడుతూమండలంలోని ప్రజలకు తెలియజేయునదిఏమనగా ఈ విధంగా ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారు చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని అలవాటుగా ఈ రకమైన కార్యక్రమాలకు చేసినట్లయితే వారిని పైన పిడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించడమైనది తెలియజేశారు.