దొంగతనం కేసును చేదించిన పోలీసులు

నగదు మరియు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

మంగపేట నేటిధాత్రి

డిసెంబర్ ఒకటో తారీకు మంగపేట మండలం కమలపూర్ లో జరిగిన దొంగతనం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న నేపద్యంలో శనివారం సాయంత్రం మంగపేట మండల కేంద్రంలో కోమటిపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలసులు వాహనాలు తనికీ చేస్తుండగా ఒక వ్యక్తి ని అనుమానస్పదంగ గుర్తించి విచారించగా అతను గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తిగా గుర్తించి విచారించగ అతని పేరు చెల. సందీప్ తండ్రి నర్సయ్య, 31 సంవత్సరాలు వీరపురం, యస్ యస్ తాడ్వాయి అని తెలిపి కొన్ని రోజుల క్రితం కమలాపురం లో జరిగిన దొంగతనం తానే చేసినట్లుగా ఒప్పుకోగా వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని పంచుల సమక్షంలో అతని వద్ద నుండి రూ.1, 19, 000/-, ఒక సెల్ ఫోన్ సీజ్ చేసి తదుపరి రిమాండ్ నిమిత్తం ములుగు కోర్టు లో హాజరు పరచడం జరిగిందనీ మంగపేట ఎస్సై గోదారి రవి కుమార్ తెలియ జేశారు, ఈ కేసును చేదించడంలో కృషిచేసిన సిబ్బంది మోహన్, అనిల్, చంద్రమోహన్, సురేష్, ప్రసాద్ లను అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version