మొగుళ్లపల్లి సెప్టెంబర్ 17 నేటి ధాత్రి
మండలంలో మతి స్థిమితం సరిగా లేని వృద్దురాలు దారితప్పి మొగుళ్లపల్లి మండలంలోని వేములపల్లి, గ్రామంలో సోమవారం రోజున రోడ్డు పైన తిరుగుతున్న క్రమంలో స్థానికుడు విజయ్ వృద్దురాలును గమనించి. వినాయక నిమజ్జనం సందర్బంగా. అక్కడే డ్యూటీ చేస్తున్న మొగుళ్లపల్లి బ్లు కొల్ట్ కానిస్టేబుల్ సారంగపాణి, విజయ్ లకు సమాచారం ఇవ్వగా తక్షణమే స్పందించి. వెళ్ళీ ఆమె యొక్క వివరాలు తెలుసుకొనగా. ఆమె పేరు అధారు కార్డు ప్రకారం డేగల వరక్క, భర్త, సమ్మయ్య,, ముదిరాజ్ కులం , వృత్తి: కూలి, ములుగు జిల్లా ఘనపురం అని తెలిసింది. వెంటనే మొగుళ్లపల్లి ఎస్ హెచ్ ఓ. బొరగల అశోక్, ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జి. సుధాకర్ ఘనపురం లోని ఆమె సంబంధికులకు సమాచారం ఇవ్వగా ఆమె కొడుకు దెగల రవి మొగుల్లపల్లి స్టేషన్ కి రప్పించి, వివరాలు అడుగగా డేగల రవి ఈ నెల 13 వ తారీకు నుండి తన తల్లి, కనిపించుట లేదని మతి స్థిమితం సరిగా లేని కారణంగా తప్పిపోయిందని పోలీసులకు తెలుపగా. వృద్దురాలుని అతని కొడుకు డేగల రవి కి అప్పగించడం జరిగిందని తెలియజేసారు.
మతిస్థిమితం లేని వృద్దురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
