హన్మకొండ:
ట్రాఫిక్ రద్దీని నియంత్రణ భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హనుమకొండ ప్రాంతంలో పలు ట్రాఫిక్ జంక్షన్లను క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ అధికారులతో పరిశీలించారు. ఇందులో భాగంగా బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ముందుగా మర్కజీ పాఠశాల వద్ద మూసివేసిన ట్రాఫిక్ జంక్షన్ పరిశీలించారు. మర్కజీ జంక్షన్ వద్ద మూసి వేయడం ద్వారా కుమార్‌పల్లి మార్కెట్, ఈదుల వాగు, పెద్దమ్మగడ్డ ఆ క్రింది ప్రాంతాలకు వేళ్ళే వాహనదారులు మిషన్ హస్పటల్ వద్ద యూ టర్నన్ నుండి రాంగ్ రూట్‌లో వాహనదారులు ప్రయాణిస్తుండంతో పాటు, నయీంనగర్ ప్రాంతంలోని ప్రధాన రోడ్డు మార్గంలోని బ్రిడ్జ్ పనులు కోనసాగుతుందడంతో కెయూసి వైపు వేళ్ళే వాహనదారులకు మర్కజీ జంక్షన్ వద్ద డివైడర్‌ను మూసి వేయడంతో వాహనదారులకు ఇబ్బందులకు గురౌవుతున్నట్లుగా పోలీస్ అధికారులకు పలు విన్నపాలు రావడంతో దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో మర్కజీ జంక్షన్ పరిశీలించారు. ఈ జంక్షన్ తిరిగి పున:ప్రారంభించడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్దీకరణలో కలిగే సానుకూల పరిణామాలపై పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అధికారులను అడిగితెలుసుకున్నారు. ప్రస్తుత స్థితిగతుల దృష్యా వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో వుంచుకోని మర్కజీ జంక్షన్ వద్ద మూసి డివైడర్లను తోలిగించాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు అదేశించడంతో పాటు, ఈ జంక్షన్ నుండి ప్రయాణించే వాహనాల సంఖ్య దృష్టిలో వుంచుకోని ఈ జంక్షన్ వద్ద విధులు నిర్వహించేందుకుగాను ఏ.ఆర్ పోలీస్ సిబ్బందిని వినియోగించుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ ఆదాలత్ జంక్షన్‌ను పరిశీలించారు. ఈ జంక్షన్‌తో పాటు నగరంలోని ఇతర జంక్షన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో గతంలో ఎర్పాటు చేసిన పాత ట్రాఫిక్ సిగ్నల్ కొత్తగా ఎర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ అడ్డుగా నిలవడంతో వాహనదారులకు సిగ్నల్స్ సరిగా కనిపించ ఇబ్బందులకు గురౌవుతున్నారు. ఈ సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్ పాత ట్రాఫిక్ సిగ్నల్స్ తొలిగించి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసేందుకుగాను ట్రాఫిక్ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
పోలీస్ కమిషనర్ వెంట ట్రాఫిక్ ఏసిపి సత్యనారయణ, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు షూకూర్, నాగబాబు, హనుకొండ ఇన్స్‌స్పెక్టర్ సతీష్ వున్నారు.