నూతన ఆవిష్కరణలతో సమస్యలకు పరిష్కారం..
జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు చాలా అద్భుతంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు.
విద్యార్థుల కృషిని జిల్లా కలెక్టర్ అభినందించరు. మహబూబ్ నగర్ లోని ఫాతిమా విద్యాలయంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రదర్శించిన ప్రయోగాలను నిశితంగా పరిశీలించడంతోపాటు ప్రయోగాల ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. అనేక సమస్యలకు చక్కని విద్యార్థులు పరిష్కారాలను చూపించగలిగారని కలెక్టర్ అన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు తనను అమితంగా ఆకర్షించాయని పరిసరాల్లో ఉత్పన్నమయ్యే పలు సమస్యలకు నూతన ఆవిష్కరణల ద్వారా పరిష్కారాన్ని చూపించడం ప్రశంసనీయమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రకృతి విపత్తుల్లో సెన్సార్ ల ద్వారా అప్రమత్తమయ్యే ప్రయోగాలు అగ్ని ప్రమాదాల నివారణ శుద్ధమైన నీటిని అందించడానికి పరిష్కార మార్గాలు వర్మి కంపోస్టు తయారీ వంటి పలు ప్రయోగాలు ఎంతో ఉపయుక్తమని కలెక్టర్ అన్నారు. రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలు కూడా వైజ్ఞానిక ప్రదర్శనలో ఏర్పాటు చేశారని వాటి వల్ల రైతులకు ఎంత మేలు జరుగుతుందని కలెక్టర్ అన్నారు. చిన్నపిల్లల్లోనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ అన్నారు. పాఠశాల స్థాయిలో ప్రయోగాత్మక బోధనలకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇంతవరకే గుర్తింపు పొందారని వారి ప్రేరణతో మరింత మంది విద్యార్థులు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ సైన్స్ అధికారి శ్రీనివాసులు సీఎంఓ బాలు యాదవ్ ఏ ఎం ఓ దుంకుడు శ్రీనివాస్ విద్యాశాఖ పర్యవేక్షకులు శంభుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..