నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మోకు దెబ్బ బృందం.
నల్లబెల్లి, నేటి ధాత్రి: గత ఆరు నెలలుగా గీతా కార్మికులు గాయపడి మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియాను వెంటనే చెల్లించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మోకు దెబ్బ మండల అధ్యక్షుడు పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం 2024 సంవత్సర నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేసి అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్ కు నూతనచైర్మన్ కమిటీని నియమించాలని గీతా కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టి గీత కార్మికుల సంక్షేమం కోసం కేటాయించాలని అదేవిధంగా గతంలో ప్రకటించిన విధంగా గీతా కార్మికులకు ఆదునూతన సేఫ్టీ మోకులు కేటాయించాలని వృత్తిలో భాగంగా చనిపోయిన కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ను ప్రభుత్వం అందించి ఆదుకోవాలని పై హామీలు అమలు చేయని యెడల రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా గీతా కార్మికుల నిరసన తప్పదని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మద్దెల సాంబయ్య గౌడ్, తడుక అశోక్ గౌడ్, సట్ల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చిక రవీందర్ గౌడ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పని రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఏరుకొండ సదానందం గౌడ్, ముఖ్య సలహాదారుడు సుద్దాల ఆనందం గౌడ్, నాయకులు సట్ల రమేష్ గౌడ్, పెరుమాండ్ల రాములు గౌడ్, పులి చక్రపాణి గౌడ్, కక్కెర్ల రమేష్ గౌడ్, అంబాల రాజ్ గౌడ్,అనిల్ గౌడ్, దిలీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు