ధాతల సహాయం తో ఆపరేషన్
నేటిధాత్రి.కొత్తగూడ,
కొత్తగూడ మండల కేంద్రం నీకి చెందిన బాల్య స్వప్న కు కూతురు చిన్నారి శైని అనే 11 నెలల పాప ఉంది
చిన్నప్పుడే ఎంతో ఉషారూ గా ఉంటున్నా పాప ను చుసి స్వప్న ఆనందపడేది అంతలోనే పాప అనారోగ్యం బాధపడుతుంటే ఆసుపత్రి కి తీసుకువెళ్లారు అప్పుడు పిడుగు లాంటి వార్త స్వప్న కు తెలిసింది చిన్నారి శైని కి గుండె లో మూడు రంద్రాలు ఉన్నాయని ఆపరేషన్ చేయకపోతే పాప బతకదని డాక్టర్ లు చెప్పారు. రెక్కడితే డొక్కాడని స్వప్న కుటుంబం ఎం చేయాలో తెలియని పరిస్థితి ఇంతలోనే కుటుంబం నీకి పెద్ద దిక్కు గా ఉన్న స్వప్న అన్న వాహన ప్రమాదం లో మరణించరు ఎం చేయాలో తెలియదు ఎటు వెళ్లాలో తెలియదు అయ్యేమయం లో ఉంటూ ఏడుస్తున్న వారి కుటుంబం నీకి
మేమున్నామని అంటూ ముందుకు వచ్చారు కొత్తగూడ మండల కేంద్రం నీకి చెందిన మల్లెల రణధీర్ మాజీ సర్పంచ్
పేరుకు మాజీ సర్పంచ్ అయినా ప్రజలు ఏ కష్టం వచ్చిన ముందు ఉండే మల్లెల రణధీర్ ఆసుపత్రి యాజమాన్యం తో మాట్లాడితే ఆపరేషన్ కు ఖర్చు బాగా అవుతుందని చెప్పారు
వెంటనే మల్లెల రణధీర్ వివిధ సోషల్ మీడియా లో పాప పరిస్థితి వారి కుటుంబం దీనస్థితి గురించి పోస్ట్ చేయడం వారి మిత్రులకు అధికారులకు తెలియజేయడం తో చాలా మంది ధాతలు వారికీ తోచిన విదంగా సహాయం చేసారు.
పాప పరిస్థితి ని ములుగు నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత తెలంగాణ మంత్రి వర్యులు ధనసరి సీతక్క ద్రుష్టి కి తీసుకువెళ్లగా వెంటనే తన తనయుడు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు శ్రీ కుంజ సూర్య
గారు స్పందించి మల్లెల రణధీర్ గారితో కలిసి అపోలో ఆసుపత్రి వెళ్లి యాజమాన్యం తో మాట్లాడారు…
పాప కు సోమవారం రోజు అపోలో ఆసుపత్రి లో డాక్టర్ లు ఆపరేషన్ విజయవంతం చేసారు…పాప ఆరోగ్యం నిలకడగా ఉందని పాప ను చుసిన ఆనందం లో స్వప్న గారు మాట్లాడుతూ…మా పాప కు ఆపరేషన్ కు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నానీ సర్పంచ్ మల్లెల రణధీర్ లేకపోతే మా పాప మాకు దక్కెది కాదని మా జీవితంతం మల్లెల రణధీర్ గారికి రుణపడి ఉంటామని వివిధ సామజిక మధ్యమాల ద్వారా మా పరిస్థితి నీ ప్రజలకు చేరావేసిన గ్రూప్ అడ్మిన్ లకు దండాలు పెడుతున్నామని బాల్య స్వప్న తెలిపారు…