బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం
భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించినకూరగాయల సముదాయానికి కామ్రేడ్ అమరజీవి గుండా మల్లేష్ నామకరణం చేయాలని జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ బెల్లంపల్లి సిపిఐ పట్టణ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఆడెపురాజమౌళి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ మేకల దాస్, కామ్రేడ్ జోగుల మల్లయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి బెల్లంపల్లి సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణజిల్లా సమితి సభ్యులు గుండా మాణిక్యం మిట్టపల్లి పౌలు, చాడమహేందర్ రెడ్డి, దేవి పోషన్న, బియ్యాల ఉపేందర్ పాల్గొన్నారు.