శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడదాం.
-సనాతన ధర్మానికి ఆధారంగా తీసుకువస్తున్నదే ఈ నూతన విద్యావిధానం.
– అశాస్త్రీయ, బ్రాహ్మణియ, ఫాసిజాన్ని తరిమికొడుదాం.
– డాక్టర్ ఎం.ఎఫ్ గోపినాథ్.
ప్రపంచ దేశాలు శాస్త్ర సాంకేతికత వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంటే నేటి మన దేశ పాలకులు అందవిశ్వాసాల వైపు విద్యార్థులను తీసుకువెళ్తున్నారని, విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ విద్య కాషాయీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహించే విధంగా వారి విధానాలు ఉన్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ అన్నారు. గురువారం నాడు కాకతీయ యూనివర్సిటీ వృక్షం శాస్త్రవిభాగం సమావేశ మందిరంలో నూతన జాతీయ విద్యా విధానం – 2020ని రద్దు చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కామగోని శ్రావణ్, మున్నా గణేష్, ఉప్పుల శివల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యవక్తగా విచ్చేసిన డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా కాషాయకరణ,కార్పొరేటీకరణ చేసే విధంగా తన అడుగులు వేస్తుందని అలాగే మనువాద సిద్ధాంతాన్ని అమలు పరచడంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం-2020ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే పాఠ్య పుస్తకాలలో భగత్ సింగ్, అంబేద్కర్ వంటి మేధావుల చరిత్రతోపాటు జీవ పరిమాణ సిద్ధాంతం అయిన డార్విన్ సిద్ధాంతాన్ని, మాండలిఫ్ అవర్తన పట్టికను తొలగించే కుట్ర చేస్తుందన్నారు. నూతన విద్యా విధానం అనే పేరుతో అశాస్త్రీయమైన అందవిశ్వాసాలతో కూడుకున్న విద్యా వ్యవస్థను దేశం కరోనా సమయంలో బిక్కుబిక్కుమంటూ ఉంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా ఆగమేఘాలపై ఎన్ఈపి – 2020ని తీసుకువచ్చిందని సాంస్కృతి, సాంప్రదాయాల మాటున ఈ దేశంలోని సంపద కొద్దిమంది చేతిలోనే ఇంకా కేంద్రీకరింపబడడానికి సామాజిక సమానతలను పెంచి పోషించడానికి బిజెపి ప్రభుత్వం చట్టబద్ధం చేసే చుట్టం లాంటిదే ఈ నూతన విద్యా విధానం అని వారు దుయ్యబట్టారు. గత మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుండి ఈ దేశం విచ్ఛిన్నం చేయబడిందని, ఎంతోమందికి ఈ దేశంలో భూమిపై, చదువుపై హక్కులు లేకుండా చేసిన సనాతన ధర్మానికి ప్రతిరూపమైన మనుధర్మ శాస్త్రాన్ని మరల మన భావితరాలపై రుద్దే చర్య చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం రాక ముందుకు గతంలో ఈ దేశ ప్రజలను పరిపాలించిన సనాతన ధర్మం ఎంతమంది ప్రజలను అభివృద్ధి పదంలో నడిపిందో చూపాలని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. ఈ దేశ మూలవాసుల నిజ చరిత్రను ఖూనీ చేసి కొందరు అంద విశ్వాసాలను అభూత కల్పనలను మన మెదల్లలో బలవంతంగా చోప్పించారని ధ్వజమెత్తారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో,విద్యా రంగాలలో,ఉపాధి రంగాలలో అభివృద్ధి సాధించినప్పుడే అభివృద్ధి చెందుతుంది కానీ అంద విశ్వాసాలను నమ్ముకొని అభివృద్ధి చెందిన దేశం ప్రపంచ పటంలో ఏఒక్క దేశం కూడా లేదని వారు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పింగిళి మహిళా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ ఎన్నో సిరి సంపదలకు నిలయమైన ఈ దేశం భారత ప్రజలది అని, ఇది అభివృద్ధి పదంలో నడవాలంటే ప్రతి ఒక్కరు రాజ్యాంగంలోని తమ హక్కులను సాధించుకున్నప్పుడే ఈ దేశం ఆర్థిక అసమానతలు లేని దేశంగా ప్రపంచ పటంలో నిలుస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అందరికీ హక్కులను భారత రాజ్యాంగం ప్రసాదించిందని, కానీ అది ఓర్వలేని కొందరు రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రగల్బాలు పలకడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు, బుద్ధిజీవులు మేధావులు ఈ దేశ అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి పౌరుడు అశాస్త్రీయతకు అంద విశ్వాసాలకు అబూత కల్పనలకు, కార్పొరేటీకరణకు, కాషాయీకరణకు, కర్మ సిద్ధాంతానికి వేదిక కాబోతున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్స్ గోపాల్ రెడ్డి, ప్రవీణ్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, కాకతీయ డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.