రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఉత్తమ రైతు ఎడవెల్లి కిషనరెడ్డి కూతురు ఎడవెల్లి అంజలి ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గురుకుల పరీక్ష ఫలితాలలో మూడు ఉద్యోగాలు సాధించినందున లయన్స్ క్లబ్ ఆఫ్ గోపాలరావుపేట ఆద్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈకార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కర్ర ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రాపెల్లి శ్రీనివాస్, పిజెడ్సి కర్ర శ్యామ్ సుందర్ రెడ్డి, పిఆర్సి గోలి మధుసూదన్ రెడ్డి, సభ్యులు కర్ర రాజిరెడ్డి, కోట్ల మల్లేశం, ముదుగంటి రాజిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చాడ దామోదర్ రెడ్డి, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.