కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్
పరకాల నేటిధాత్రి
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా,వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27నజన్మించాడని,స్వాతంత్ర్యోద్యమంలో,నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్న వ్యక్తి అని 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు,ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు.తొలి,మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి నడిపించిన మహానేత తొలినాళ్లలో సమైక్యవాది అయిన బాపూజీ, మొదట విశాలాంధ్రకు మద్దతు ప్రకటించినా ఆంధ్ర పాలకుల వివక్షను స్వయంగా ఎదుర్కొని తన అభిప్రాయాలను మార్చుకుని 1969 నాటి తెలంగాణ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారని 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా అండగా నిలిచారని,తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటుతూ వచ్చారు.తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం జలదృశ్యంలోనే పురుడు పోసుకుందని తెలంగాణ నినాదం ఎత్తుకున్న వారందరికీ అండగా నిలిచారని అన్నారు.96 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్లో తెలంగాణ కోసం దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మన బాపూజీ అని 14వ వార్డు కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ అన్నారు