ఈనెల28 నుండి మధ్యాహ్న భోజన కార్మికులనిరవధిక సమ్మె
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
మధ్యాహ్న భోజన కార్మికులకు జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన వేతనాలు ఏరియర్స్ తో సహా సెప్టెంబర్ 27 లోపు చెల్లించని యెడల, మధ్యాహ్న భోజన కార్మికులు ఈనెల 28 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారని సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ గౌడ్అన్నారు.
శుక్రవారం చండూరు మండల తహసిల్దార్ కు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 రూపాయల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించి నేటికీ అమలు చేయలేదని అన్నారు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మూడు రోజుల టోకెన్ సమ్మె చేసిన సందర్భంగా 2023 జూలైలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ వేతనాలు పెంచుతున్నామని మరోసారి ప్రకటించారని వారు అన్నారు.. జీవో నెంబర్ 8 విడుదల చేస్తూ పెంచిన 2000 రూపాయల వేతనం నేటి నుండి అమలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమైందని నేటికీ ఇవ్వలేదనివారు అన్నారు. పెంచిన రెండువేల తో కలిపి నెలకు 3000 రూపాయలు ఇంతవరకు కార్మికుల అకౌంట్లో జమ కాలేదనిఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కొత్త మెనూ ప్రకారం రేట్లు పెంచి బడ్జెట్ విడుదల చేయాలని అవసరమైన చోట వంట సామాగ్రి సబ్సిడీపై గ్యాస్ కాటన్ యూనిఫామ్స్ ఈఎస్ఐ పిఎఫ్ ప్రమాద బీమా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు ఇతర సమస్యలు పరిష్కరించని ఎడల సెప్టెంబర్ 28 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల కార్యదర్శి ముత్తవాని, మండల ఉపాధ్యక్షులు పల్లె కవిత,కట్టహిందూ,సీత యాదమ్మ, మద్ది లక్ష్మమ్మ,తదితరులు పాల్గొన్నారు
