కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రం కారల్ మార్క్స్ కాలనీ శ్రామిక భవన్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం మహేందర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ శాఖల సహకారంతో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 19,వేల మంది దళిత పిల్లలు 6 వేల మంది గిరిజన పిల్లలు మొత్తం 25 వేల మంది పేద విద్యార్థులు రాష్ట్రంలో చదువుకుంటున్నారు. ప్రతి ఏటా చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా 175 కోట్ల చెల్లించకుండా దళిత గిరిజన విద్యార్థుల చదువులకు కోతపడే అవకాశం ఉంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం 8 నెలలు చెల్లించలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎడాది అవుతున్న ఈ బిల్లులు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు తమ చదువులు నష్టపోతున్నారు ప్రభుత్వ ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు పిల్లలకు వశతి భోజనాలు కూడా పెట్టలేకపోతున్నామని తమ గోడును వెళ్లా బోసుకుంటున్నారు ఈ స్కీం కింద చదువుతున్న విద్యార్థుల ఫీజులను తల్లిదండ్రులు చెల్లించాలని ఒత్తడి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రభుత్వం నుండి బకాయి పడ్డ175 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ నిర్మల్ సురేష్ చందు రాజేందర్ రవి తదితరులు పాల్గొన్నారు.