భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పక్కన నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మండలి పూజ కార్యక్రమ వేడుకల్లో భాగంగా విశ్వస్కేణ పూజ,పుణ్యాహ వచనం,పంచ గవ్య ప్రవహన,వాస్తు దోషపూజ,అభిమంత్రణ, దీక్షధారణ పూజ వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో నిర్విస్తున్న పూజ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు, భక్తులు,మహిళలు అందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతులు ఆహ్వానించారు.
మూడు రోజుల పాటు నిర్వహించే పూజ వేడుకల్లో అందరూ ప్రాంతాలకు అతీతంగా పాల్గొని,స్వామి వారిని దర్శించుకుని, ప్రసాదం తీసుకోవాలని సాదర స్వాగతం మీ పూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు