సంఘాలకు ఫిల్లర్లు పాలకవర్గ సభ్యులు..

# త్వరలో పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ.
# సహకార వికాస సంస్థ అధ్యక్షురాలు జయప్రద.
# ఘనంగా 11 వ వార్షిక మహాసభ.

నర్సంపేట,నేటిధాత్రి :

సహకార భావంతో మ్యాక్స్ చట్టం కింద సేవలు అందిస్తున్న స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాల పాలకవర్గ సభ్యులు ఫిల్లర్ లాంటివారని సహకార వికాస సంస్థ అధ్యక్షురాలు కాసర్ల జయప్రద అన్నారు.దుగ్గొండి మండల కేంద్రంలో గల దుగ్గొండి పురుషుల పొదుపు సమితి 11 వ వార్షిక మహాసభ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన జరిగింది.సమితి పరిధిలోని మొత్తం 10 సంఘాలు చంద్రయ్యపల్లి,కమ్మపల్లి,దుగ్గొండి, నేరేడుపల్లి,రేబల్లే,వసంతాపుర్,వెంకటాపురం,ప్రగతిసింగారం,దేశాయిపల్లె,అక్కంపేట ఉండగా డిసెంబర్ 2023 నాటికి మొత్తం సభ్యులు 4348 మంది సభ్యులు ఉన్నారు.అలాగే సమితి పరిధిలో సంఘాల మొత్తం నిధులు 8 కోట్ల 81 లక్షల 60 వేల 300 ఉన్నాయి.కాగా ఆయా సంఘాల అభివృద్ధి చెందుతేనె సమితి అభివృద్ధి చెందుతుందని చర్చించుకున్నారు.సంఘాల నుండి పలు సూచనలు,సలహాలు తీసుకున్నారు.ముఖ్య అతిథులుగా సహకార వికాస సంస్థ అధ్యక్షురాలు కాసర్ల జయప్రద,ధర్మ కర్తల మండలి సభ్యులు దర్మవతి,డెవలప్ మెంట్ అధికారి నవీన్ హాజరైయ్యారు.ఈ సందర్భంగా సీడీఎఫ్ అధ్యక్షురాలు కాసర్ల జయప్రద మాట్లాడుతూ మనది అనే భావనతో సంఘాలు అభివృద్ధితో ముందకు పోతున్నారు.నేటి స్వకృషి సంఘాలు వచ్చే తరాలకు ఎంతోగానో ఉపయోగపడుతాయి.సహకార భావంతో పాలకవర్గ సభ్యులు సంఘాలను సేవలు చేస్తున్నారని అన్నారు.సంఘాల్లో అమలు అవుతున్న అన్ని పథకాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని అమే సూచించారు.నూతన సాప్ట్ వేర్ తో పూర్తి స్థాయిలో కంప్యూటరీకణ కాబోతున్నది సిడిఎఫ్ అధ్యక్షురాలు తెలియజేశారు.ధర్మకర్త దర్మవతి మాట్లాడుతూ సంఘాల పాలకవర్గ సభ్యులు ఒక ఆణిముత్యాలలాంటి వారు అని పేర్కొన్నారు.సేవ చేసిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు కందికొండ రవీందర్, సమితి పాలకవర్గ సభ్యులు, చంద్రయ్యపల్లి,కమ్మపల్లి,దుగ్గొండి, నేరేడుపల్లి,రేబల్లే,వసంతాపుర్,వెంకటాపురం,ప్రగతిసింగారం,దేశాయిపల్లె,అక్కంపేట సంఘాల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,గంగిడి రాజిరెడ్డి, పోలోజు లింగమూర్తి, కడివెండి సత్యనారయణ,పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి, ముదురుకోల నర్సయ్య,రాయారాకుల రమేష్, మోకిడే బాపురావు,వేములపెల్లి బాబు,సమితి గణకులు పోలోజు రమణాచారి,సంఘాల ఉపాధ్యక్షులు,పాలకవర్గ సభ్యులు ,గణకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version