మలహార్ రావు, నేటిధాత్రి :
మండలంలోని కొయ్యూరు గ్రామంలో మైనార్టీ సోదరుల కుటుంబ సభ్యులందరిని రంజాన్ పండుగ సందర్భంగా సోదర భావంతో వారికి కలిసి మీరు అందరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం సంతోషంగా రంజాన్ పండుగాను సంతోషంగా జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటు ముస్లిం సోదరుల కుటుంబాలతో కలిసి పెద్దాయన కాయపాషాతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ముస్లిం కుటుంబాల సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం స్టేట్ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ విజయగిరి సమ్మయ్యనాయి, మండలం నాయి బ్రాహ్మణ సంఘం ప్రధానకార్యదర్శి బీసీ సంఘం సీనియర్ నాయకులు అడ్డురి తిరుపతినాయి, కమల్, కలిం, గౌస్, అతిక్, సోదరులు తదితరులు పాల్గొన్నారు.
