మహిళ సంఘాల ద్వారా ప్రభుత్వ స్కూల్ యూనిఫాం తయారీ పరిశీలించిన జిల్లా కలెక్టర్

కాటారం నేటి ధాత్రి

కాటారం మండల కేంద్రం లోని మహిళ సమాఖ్య భవనంలో జీవన జ్యోతి మండల సమాఖ్య మహిళ సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ ల తయారీ కుట్టుకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని మొత్తం 49 మండల పాఠశాలలకు గాను 901 బాలురు,988 బాలికలు ఉండగా మొత్తం బాల బాలికల సంఖ్య 1889 పిల్లలకు గాను 3878 స్కూల్ యూనిఫామ్ లు తయారీకి జీవన జ్యోతి మండల సమాఖ్య సబ్యులకు ఇవ్వడం జరిగిందని యూనిఫాం ల తయారీ జూన్ 10 వ తేదీ లోపు అందించాలని ఎందుకంటే జూన్ 12 నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్10 వ తేదీ లోపు బాల బాలికలకు యూనిఫామ్ లను అందించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు శిక్షణ పొందిన సమాఖ్య మహిళ సభ్యులు పిల్లల కొలతల ఆధారంగా యూనిఫాం ల కుట్టాలని నాణ్యమైన మెటీరియల్ బిగించి యూనిఫామ్ ధరించిన పిల్లల్లో నూతన ఉత్సాహం తేజరిల్లేలా తయారు చేయాలని కలెక్టర్ అన్నారు పాఠశాల పిల్లల సంఖ్య ఆధారంగా కొలతలు 5 గురు చొప్పున భిన్నమైన సైజ్ కొలతలు బేరుజు చేసుకొని మరి బిగ్గరగా కాకుండా వదులుగా యూనిఫామ్ లను కుట్టాలని మహిళ సమాఖ్య సభ్యులను కలెక్టర్ కోరారు ఈ సీజన్ పూర్తి అవగానే మహిళ గ్రూప్ సభ్యులకు చేయూత కలిపించడానికి, ప్రభుత్వ పరమైన యూనిఫామ్ ల తయారీని ప్రభుత్వం మహిళ సంఘాలకు అప్పగించే యోచనలో ఉందని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా స్కూల్ యూనిఫామ్ ల తయారీకి కొనుగోలు చేసిన బట్ట నాణ్యతను పరిశీలించి మహిళా సమాఖ్య సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నరేష్,తాశిల్దార్ నాగరాజు,ఎం పి డి ఓ బాబు, ఎం పి ఓ ఉపేంద్రయ్య,కుట్టు శిక్షనరాలు, సుజాన వనిత,జీవన జ్యోతి మండల సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!