జడ్పీహెచ్ఎస్ రాజపేట ఉన్నత పాఠశాల అభివృద్ధి చాలా అభినందనీయం

టీచర్ ఎం ఎల్ సి శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

మంగపేట నేటిధాత్రి

జడ్.పి.హెచ్.ఎస్ రాజుపేట స్కూల్ కాంప్లెక్స్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 10 గంటలకు ఉమ్మడి జిల్లాల ఖమ్మం ,నల్గొండ ,వరంగల్, నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విద్యాభివృద్ధి లో భాగంగా పాఠశాలను సందర్శించడం జరిగింది
పాఠశాల భవనం , మౌలిక వసతులు ,విద్యార్థుల క్రమశిక్షణ. ఇతరత్రా విషయాల పైన
పరిశీలించి అభినందనలు తెలియజేశారు ములుగు జిల్లా నుండి ఇంత దూరంలో ఉన్న పాఠశాలను ఇంత అభివృద్ధిలో ఉంది కావున నేను చాలా సంతోషిస్తున్నాను అని అన్నారు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు ఇందులో భాగంగా పాఠశాల స్థిరదాత తోట రమేష్ ఉండవెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు
అదేవిధంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ నాటి ,నేటి ప్రభుత్వాలు చేస్తున్న ఉపాధ్యాయ జీవోల పైన అనేక రకాల సమస్యల పైన ఉపాధ్యాయులకు సరైన సమాచారాన్ని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో రావుల భాస్కరరావు ,గడ్డం శ్రీనివాస్, పాయం విరనారాయణ , బి బాలాజీ, అనుమ పావని, వట్టే రాజలక్ష్మి, జమున, డి పద్మ, డి లావణ్య, పటాన్ ఆస్మా బేగం,తదితరులు పాల్గొని చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version