కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి కార్యదర్శి రఘునాథ్ రెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
అమరవీరుల త్యాగాలను కీర్తిస్తూ రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి కార్యదర్శి పిన్నింటి రఘునాథ రెడ్డి లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. నిజాం పరిపాలనకు స్వస్తి పలికి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసిన సెప్టెంబర్ 17 రోజును ప్రతి సంవత్సరం ప్రజా పాలన దినోత్సవంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, తెలంగాణ ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారంటీల పథకాలను తెలంగాణ ప్రజలందరికి లబ్ధి పొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.