గాయాలతో బయటపడ్డ కుమారస్వామి
జైపూర్, నేటి ధాత్రి :
జైపూర్ మండలం నర్వ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిసిసి కార్నర్ సుభాష్ నగర్ కు చెందిన ఆవుల కుమారస్వామి తన ఇన్నోవా వాహనంలో (A P 28DD 0009) అతి వేగంగా జాతీయ రహదారిపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ కు తగలడంతో వాహనం పల్టీలు కొడుతూ బోల్తా పడింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలతో ఉన్న ఆవుల కుమారస్వామిని చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ఉపేందర్ తెలిపారు.