ప్రమాదకరంగా రహదారి మూలమలుపులు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రం నుండి సింగారం రోడ్డుకు పోయే మార్గానికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు బారిన పడుతున్నట్లు ప్రయాణికులు అంటున్నారు. ఈ మార్గం గుండా మూల మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉండి దగ్గరగా వచ్చేంతవరకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగం అదుపు చేయలేక పోవడం వల్ల వాహనదారులు మలుపులు గమనించకుండా వేగంగా వచ్చి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామపంచాయతీ సిబ్బంది చొరవ తీసుకొని ముళ్ల పొదలు తొలగించాలని ప్రజలు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.