అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఆల్ ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ ప్రజా సంఘాలు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

 

ఆదివారం రోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐటి యు జిల్లా కార్యాలయంలోజరిగింది .దీనికి జిల్లా అధ్యక్షురాలు సరోజ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పుష్పలత 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె గురించి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరి విడనాడాలని డిమాండ్లు పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిఐటియు రాష్ట్ర నాయకులు కిల్లి గోపాల్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్, ఐఎఫ్ టీ యు,జిల్లా కార్యదర్శి సాంబశివుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ,టిపిఎస్కే జిల్లా కన్వీనర్ వి కురుమూర్తి ,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోనెల రాములు ,వరదగాలన్న ,మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయవర్ధన్ రాజు, కె వి పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం రాజు, మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు కేశవులు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సాధన, సిఐటియు పట్టణ నాయకులు రాజ్ కుమార్ లు హాజరై ప్రసంగిస్తూ అంగన్వాడి సమ్మె న్యాయ సమ్మతంగా జరుగుతున్న సమ్మె అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చిగా మోసం చేసిందని .సమ్మె డిమాండ్లు ఒప్పుకొని పరిష్కరించనందుకే సమ్మె జరుగుతుందని. అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, కనిస వేతనాలు 26,000 ఇవ్వాలని, టీచర్కు 10 లక్షలు, హెల్పర్ కు 5లక్షలు, గ్రాటిట్యూ చెల్లించాలని చివరి నెలలో సగం జీతం పెన్షన్ ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారు డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శంకరగిరి మాన్యాలు పట్టించాలని, అంగన్వాడీలకు బోధించారు. అంగన్వాడీల సమ్మెకు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ,రైతు విద్యార్థి ,యువజన మహిళా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని వారు తెలిపారు. ఎన్ని రోజులైనా మొక్కవోని ధైర్యంతో పోరాడి విజయం సాధించాలని . చావు రేవు కేసీఆర్ తో తెలుసుకోవాలని మేమంతా మీకు అండగా ఉన్నామని వారు గట్టిగా మద్దతునిచ్చారు. ఇందులో అంగన్వాడీ యూనియన్ నాయకులు గౌస్య బేగం ,పద్మ ,రాజ్యలక్ష్మి, భాగ్య విజయలక్ష్మి కవిత ,పద్మ ,ఈదమ్మ మీనా కుమారి, జ్యోతి, విజయ, రుక్కమ్మ, వరలక్ష్మి ,లక్ష్మి, సత్యమ్మ తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం సమావేశం ఏకగ్రీవంగా తీర్మానము ఆమోదించారు. తీర్మానాల్లో బిఎల్ఓ డ్యూటీలు చేయరాదని ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగించాలని డిమాండ్లు సాధించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని, బెదిరింపులకు అదరరాదని ఏకగ్రీవంగా తీర్మానాన్ని
సరోజ పుష్పలత జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆమోదించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version