# పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :
పరకాల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.శుక్రవారం గీసుకొండ మండల మచ్చాపురం గ్రామం నుంచి బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు లక్కారుస్ రవికుమార్ అధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీపీ భీమాగాని సౌజన్య గౌడ్,కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిని చాడ కొమురా రెడ్డి, మాధవరెడ్డి, దూలం వేంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారం స్వామి, కూసం రమేష్, గీసుకొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్, ప్రతిపాక కొమురయ్య, మర్రి చేరాలు,సునీల్ పాల్గొన్నారు.
# కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో.. నమిండ్ల రవి కుమార్, రాజు, పైడి, అనిల్, అశోక్, చిన్న సాంబయ్య, నరసయ్య, గోపాలకృష్ణ, నరసింహస్వామి, సానపల్లి ముత్తయ్య, సిలివేరి బిక్షపతి ,గుమ్మడి సదానందం, రవీందర్, సందీప్, పాకాల ఎల్లయ్య, మచ్చ వినోద్, పాకాల సాంబయ్య, కుమారస్వామి నవీన్, స్వరాజ్ కుమార్, చిన్నపెళ్లి సాంబయ్య, కుమార్ లతో పాటు మొత్తం 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.