అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్.
భద్రాచలం నేటి ధాత్రి
స్థానిక అయ్యప్ప కాలనీలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం డేగల శివ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న దళితుల్ని కొండ గిరిజనులుగా గుర్తించి వారికి అన్ని రకాల హక్కులను, అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వందల ఏళ్లుగా దళితులు కాయా కష్టం చేస్తూ శ్రమజీవులుగా గిరిజనులతో పాటు జీవిస్తున్న దళితుల్ని కొండ గిరిజనులుగా ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఏజెన్సీ దళితులను కొండ గిరిజనులకు గుర్తించేంతవరకు ప్రభుత్వంపై ఏజెన్సీ దళితులు ఏకతాటిపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మన మహానాడు నాయకులు హుస్సేన్ ,శ్యాము, దెగల వంశి, సాయి తేజ , శ్రీశాంత్,ప్రభాకర్, బర్ల రామకృష్ణ, సామేలు,ఏసు తదితరులు పాల్గొన్నారు