అమరుల త్యాగాలు మరువలేనివని,

జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాములు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు రక్తదాన కార్యక్రమం.

“రక్తదానం ప్రాణదానం”, రక్తదానంపై అపోహలు వద్దు:జిల్లా అదనపు ఎస్పీ.

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీస్ ఆదేశానుసారం ’బ్లడ్ డొనేషన్ క్యాంప్’’ ను ఏర్పాటు చేసిన జిల్లా అదనపు ఎస్పీ.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరులైన పోలీస్ అమరవీరులకు జోహార్లు ఆర్పిస్తూ.. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ తరుపున ప్రగాఢ సంతాపన్ని ప్రకటించారు. అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం సంఘవిద్రోహశక్తులచే పోరాడి ప్రాణత్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేనివని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు.

థలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని అదనపు ఎస్పీ అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు.

ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పోలీసులతోపాటు, ప్రజలు, యువకులు రక్త దానం చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్ ఐ లు శ్రీను, నగేష్, కృష్ణయ్య, గవర్నమెంట్ హాస్పటల్ డాక్టర్ .యువన్, క్యాంప్ ఇంఛార్జి మోహన్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటయ్య మరియు సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version