రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఠాకూర్ దన్ సింగ్ ఎన్నుకోబడ్డారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల ఇంచార్జ్ బద్దం లింగారెడ్డి, సహ ఇంచార్జి రాజనీష్ జైన్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా పట్టణ అధ్యక్ష భాద్యతలు చేపట్టిన ఠాకూర్ ధన్ సింగ్ సీనియర్ బీజేపీ నాయకులైన ఆరుముళ్ళ పోశం, బంగారి వేణుగోపాల్ ,దుర్గం అశోక్, ఎన్నికల పరిశీలకుడు మోటపలుకుల తిరుపతి, రామకృష్ణాపూర్ పట్టణ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.